రేపు ఉదయం 9 గంటలకు హైడ్రా బాధితుల ఇంటికి పోతాం..కూల్చివేతలపై హరీష్‌ సంచలనం !

-

రేపు ఉదయం 9 గంటలకు హైడ్రా బాధితుల ఇంటికి పోతామని….మూసీ కూల్చివేతలపై హరీష్‌ రావు సంచలన ప్రకటన చేశారు. కేటీఆర్‌ కు జ్వరం రావడంతో… తెలంగాణ భవన్‌ లో హైడ్రా బాధితులతో మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రా రెడ్డిలు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వారి గోడు చెప్తూ కన్నీరు పెట్టారు మూసి (హైడ్రా) భాదితులు. అనంతరం హరీష్‌రావు మాట్లాడుతూ… మూసీ రివర్ డెవలప్మెంట్ లో సిఎం రేవంత్ రెడ్డి అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటున్నాడని పేర్కొన్నారు.

harish rao meets hydra victims

మూసీ పేరుతో పేదల ఇండ్లు కూలగొడుతున్న వ్యక్తీ రేవంత్ రెడ్డి అని… మూసీ పై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. హైడ్రా భాదితులకు అండగా బిఆర్ఎస్ ఉంటుంది… న్యాయ పరంగా వారికి అండగా ఉంటామని ప్రకటించారు. హామీలను పక్కదారి పట్టించే ప్రయత్నమే కూలగొట్టడమని… కొత్త నిర్మాణాలు చేయట్లేదు కానీ, కట్టిన ఇండ్లను ఈ ప్రభుత్వం కూల్చుతుందని వివరించారు. రేపు ఉదయం 9 గంటలకు మా ఎమ్మెల్యేల బృందం మీ దగ్గరకు వస్తుందని ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version