జగన్ ను మేము అడ్డుకోలేదు : హోంమంత్రి అనిత

-

జగన్ ను మేము అడ్డుకోలేదని జగన్ కు తిరుమల వెళ్లడం ఇష్టం లేకనే పర్యటన రద్దు చేసుకున్నారని హోంమంత్రి అనిత పేర్కొన్నారు.  తాజాగా  మంగళగిరిలో ఆమె మీడియాతో మాట్లాడారు.  ప్రసాదాన్ని టిష్యూ పేపర్ లో పెట్టుకొని పక్కనే పడేసే వ్యక్తులు వాళ్లు. సిట్ మీద కూడా కామెంట్ చేస్తున్నారు. తప్పుని కప్పి పుచ్చుకోవడానికి మళ్లీ తప్పులు చేశారు. లడ్డూ వ్యవహారం పై సుప్రీంకోర్టులో కేసు వేశారు. అక్షింతలు వేసిన వెంటనే దులుపుకున్న వ్యక్తి జగన్. జగన్ ఎప్పుడైనా తిరుమల లడ్డూ తిన్నారా..? అని ప్రశ్నించారు అనిత.

సంతకం పెట్టి వెళ్లాలనే దానికి రాద్దాంతం చేశారు. దళితులు అనే పదం నోట్లో నుంచి రావడానికి అర్హత లేదు. చాలా మంది రికమెండేషన్ తో వస్తారు. తిరుమల బోర్డు ను భ్రష్టు పట్టించడానికి సలహామెంబర్లను ఎందుకు పెట్టారు. నువ్వు ఇచ్చిన బోర్డులో ఒక్కరూ కూడా దళితులు లేరు. ఇప్పుడు దళితుల గురించి మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. గతంలో మీ దగ్గర పని చేసిన పోలీసులే సిట్ లో ఉన్నారు. తిరుమలలో గ్యాంగ్ ఆర్డర్ కోసం ఎందుకు కేసు వేశారు. మసీదులు, చర్చీలు, ఆలయాలకు ప్రత్యేక ఆచారాలుంటాయి. జగన్ తప్పు చేసి క్షమాపణ కోరడం లేదు. తప్పు చేయకపోతే విజిలెన్స్ రిపోర్ట్ పై కోర్టుకు ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. హైందవ సాంప్రదాయాలను ఎందుకు గౌరవించడం లేదు. ఆయా ప్రార్థన మందిరాలకు వెళ్లినప్పుడు అక్కడి ఆచారాలను గౌరవించాలి. నేను హిందువును.. నీ మతం ఏంటో ధైర్యంగా చెప్పగలవా..?అని ప్రశ్నించారు. దేశ ద్రోహం చట్టం ఉంటే.. దేశ బహిష్కరణ అనేది నీకు కరెక్ట్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు అనిత.  

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version