హిందూ ముస్లిం అంటే కడుపు నిండుతుందా – హరీష్ రావు

-

హిందూ ముస్లిం అంటే కడుపు నిండుతుందా అని ప్రశ్నించారు మంత్రి హరీష్ రావు. మెదక్ పట్టణంలో 500 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో  ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు. ఎంపీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హరీశ్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ.. కులం ఏదైనా, మతం ఏదైనా పేదలందరూ మా ఆత్మ బంధువులు అని… హిందూ ముస్లిం మధ్య కొట్లాట పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తారని బీజేపీపై ఫైర్‌ అయ్యారు. ఆ కొట్లాటలు మన కడుపు నింపుతాయా..!!?ఉచితాలు వద్దనే బిజెపిని మనం రద్దు చేయాలని కోరారు.

పేదలకు పెట్టే వాళ్ళు కావాలా పెద్దలకు దోచి పెట్టే వాళ్ళు కావాలా..?! సీఎం కేసీఆర్ సంపద పెంచి పేదలకు పెంచితే.. బిజెపి పెద్దలకు దోచి పెట్టిందని మండిపడ్డారు మంత్రి హరీష్ రావు. ఇళ్ల పట్టాలు అందుకుంటున్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలిపారు. ఏ కాంగ్రెస్, బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఇలా డబుల్ బెడ్ రుము ఇల్లు ఇస్తున్నారా.. కాంగ్రెస్ హయాంలో పేదలకు ఇల్లు రాలేదు. పేదలు బల పడలేదు గానీ వారే బలపడ్డారని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version