దమ్ముంటే సీఎం రేవంత్ గ్రామ సభలకు రావాలి – హరీష్‌ సవాల్‌ !

-

సిద్దిపేటకి వస్తావా…లేకపోతే కొండారెడ్డిపల్లికి పోదామా..రేవంత్‌ కు హరీష్‌ సవాల్‌ విసిరారు. ఇవాళ సిద్దిపేటలో మీడియాతో మాజీ మంత్రి హరీష్‌ రావు మాట్లాడారు. రుణమాఫీ అయిపోయిందని సీఎం రేవంత్ హైదరాబాద్ లో మాట్లాడుతున్నారని గుర్తు చేశారు. ప్రజాపాలనలో రుణమాఫీ కాలేదని దరఖాస్తులు వస్తున్నాయని తెలిపారు.

సీఎం రేవంత్ సిద్దిపేటకి వస్తారా…లేకపోతే ఆయన గ్రామం కొండారెడ్డిపల్లికి పోదామా చెప్పాలని సవాల్‌ చేశారు. రుణమాఫీ అయ్యిందో లేదో చూద్దామన్నారు హరీష్‌ రావు. పూర్తి రుణమాఫీ చేస్తానని పాక్షిక రుణమాఫీ చేస్తున్నారని…సీఎం రేవంత్ మాటలు నమ్మి రైతులు ఆగం అయ్యారని ఆగ్రహించారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితి ఎలా ఉందో ఈ ఘటనలు చిన్న ఉదాహరణ అని తెలిపారు. సీఎం రేవంత్ చెప్పేటివన్ని నీటి మూటలు… దమ్ముంటే సీఎం రేవంత్ గ్రామ సభలకు రావాలి… నేను కూడా గ్రామ సభకు వస్తానని సవాల్‌ చేశారు. మోసాలు తప్ప నీతి, నిజాయితీ లేనిది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని… ఎంత రుణమాఫీ చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version