తెలంగాణ కల్పతరువు కాళేశ్వరం : మంత్రి హరీశ్‌ రావు

-

కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రానికి కల్పతరువుగా మారిందని రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థిక శాఖల మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. కేసీఆర్ ఈ ప్రాజెక్టును అనుకున్న సమయానికి పూర్తి చేశారని తెలిపారు. ఈ ఏడాది వానలు సరిగ్గా కురవకపోయినా.. వర్షం కోసం ఎదురు చూడకుండా కాళేశ్వరం జలాలతో రైతులు ధైర్యంగా పంటలు పండించుకుంటున్నారని వెల్లడించారు. సిద్దిపేట జిల్లా కొమురవెళ్లి మల్లన్న క్షేత్రంలో రూ.12 కోట్ల వ్యయంతో చేపట్టిన క్యూ లైన్ కాంప్లెక్స్ నిర్మాణ పనులకు మంత్రి హరీశ్‌ రావు శంకుస్థాపన చేశారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మల్లన్న దేవాలయం దినదినాభివృద్ధి చెందుతోందని హరీశ్ రావు అన్నారు. మొక్కు తీర్చుకొనేందుకు వచ్చిన సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు రాజీవ్ రహదారి నుంచి ఆలయానికి వచ్చేలా రూ.10.30 కోట్లు నిధులతో డబుల్ లేన్ రోడ్డు పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు.  మల్లన్న కల్యాణోత్సవంలో ఇచ్చిన హామీ మేరకు స్వామివారికి బంగారు కిరీటం, వెండి తలుపులు, వెండి ముఖద్వారాలు చేయించినట్లు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version