ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్స్‌కు శుభవార్త. ఇండియన్ ఆర్మీ 196 టెక్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంజినీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు జులై 19లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఉద్యోగాల వివరాలు
- ఎస్ఎస్సీ (టెక్) – 175 పోస్టులు
- ఎస్ఎస్సీడబ్లూ (టెక్) – 19 పోస్టులు
- ఎస్ఎస్సీడబ్ల్యూ టెక్ & నాన్ టెక్ – 02 పోస్టులు
విద్యార్హతలు
- అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నవారు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
- SSCW (నాన్ టెక్) (నాన్ యూపీఎస్సీ) పోస్టులకు డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
- SSCW (టెక్) పోస్టులకు ఏదైనా ఇంజినీరింగ్ విభాగంలో బీఈ లేదా బీటెక్ పూర్తి చేసి ఉండాలి.
వయోపరిమితి
- అభ్యర్థుల వయస్సు 2024 ఏప్రిల్ 1 నాటికి 20 నుంచి 27 ఏళ్ల మధ్యలో ఉండాలి.
ఎంపిక ప్రక్రియ
- అభ్యర్థులను వారి గ్రాడ్యుయేషన్ లేదా బీటెక్ మార్కుల మెరిట్ ఆధారంగా వడపోస్తారు. తరువాత వీరికి 2 దశల్లో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. మొదటి దశలో ఉత్తీర్ణులైన వారిని, 2 దశ ఇంటర్వ్యూకు తీసుకుంటారు. ఇందులో కూడా ఉత్తీర్ణలైనవారికి.. వైద్య పరీక్షలను నిర్వహించి, శిక్షణకు తీసుకుంటారు.