తెలంగాణలో 9 ఏళ్ల నుంచి హిందు, ముస్లిం గొడవలు లేవు – హరీష్ రావు

-

తెలంగాణలో 9 ఏళ్ల నుంచి హిందు, ముస్లిం గొడవలు లేవు అన్నారు మంత్రి హరీష్ రావు. సిద్దిపేట జిల్లాకేంద్రం నిమ్రా గార్డెన్ లో బీఆర్ఎస్ పార్టీ లో అతిక్ అహ్మద్ మరియూ 100 మంది నాయకులు చేరారు. ఏ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ..అభివృద్ధిలో, సేవా కార్యక్రమాల్లో అందరం కల్సి పని చేయాలి… సామాజిక సేవలో ముందుంటున్న అతిక్ కు నా శుభాకాంక్షలు చెప్పారు.

ఇలాంటి సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న అతిక్ బి ఆర్ ఎస్ పార్టీ లో చేరడం సంతోషంగా ఉంది.. సిద్దిపేట లో 5 కేంద్రాల్లో నేను భోజనం పెట్టిస్తున్న , ప్రభుత్వ ఆస్పత్రిలో పేషేంట్ లతో పాటు సహాయకులు భోజనం అందింస్తున్నాము, రైతు బజార్ , ముస్తాబాద్ చౌక్ , గ్రంథాలయం ఇలా ప్రజల కు భోజనం పెట్టిస్తున్నామని పేర్కొన్నారు. సిద్దిపేటలో 2600 డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మాణం చేశాము. అందులో పేద ముస్లిం కుటుంబాలకు 650 డబుల్ బెడ్రూం ఇండ్లు అందించాము… తెలంగాణ లో 9ఏళ్ల నుండి హిందు, ముస్లిం గొడవలు లేవు, హిందు, ముస్లిం బాయ్ అన్నారు హరీష్ రావు.

Read more RELATED
Recommended to you

Exit mobile version