శ్రీ లీల సినిమా ఎంట్రీ ఎలా జరిగిందో తెలుసా..?

-

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం టాప్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా చలామణి అవుతున్న శ్రీ లీల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వరుసగా పది చిత్రాలలో నటిస్తున్న ఈమె క్రేజ్ చూసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. ఒకవైపు తన అద్భుతమైన నటనతో.. డాన్స్ పెర్ఫార్మెన్స్ తో అందరిని ఆకట్టుకుంటున్న ఈ ముద్దుగుమ్మ తెలుగులో రాఘవేంద్రరావు పర్యవేక్షణలో వచ్చిన పెళ్లి సందD సినిమా ద్వారా అడుగుపెట్టినప్పటికీ కూడా బాలనటిగానే ఇండస్ట్రీకి పరిచయమైంది. ముఖ్యంగా కన్నడ ఇండస్ట్రీలో తన సినీ ప్రయాణాన్ని ఎలా మొదలుపెట్టిందో ఇప్పుడు తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని వెల్లడించింది ఈ ముద్దుగుమ్మ.

శ్రీ లీల తెలుగులో హీరో రామ్ తో స్కందా సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా సెప్టెంబర్ 15వ తేదీన విడుదల కానున్న నేపథ్యంలో సినిమా చిత్ర బృందం ప్రమోషన్స్ ను వేగంగా చేపడుతున్నారు. అందులో భాగంగానే ఇంటర్వ్యూలలో పాల్గొంటున్న శ్రీ లీల తన సినిమా ఎంట్రీపై కూడా క్లారిటీ ఇచ్చింది. శ్రీ లీలా మాట్లాడుతూ.. మా అమ్మ స్వర్ణలత బెంగళూరులో ప్రముఖ గైనకాలజిస్ట్.. అమ్మ డాక్టర్ కావడం వల్ల నాకు స్కూల్లో సెలవులు వస్తే నన్ను కూడా మెడికల్ కాన్ఫరెన్స్ లకు తీసుకెళ్తూ ఉండేవారు. ఈ కారణం వల్లే నాకు కూడా వైద్య వృత్తి మీద చిన్నప్పటి నుంచి ఆసక్తి ఏర్పడింది.

ఇకపోతే నా ప్రతి పుట్టినరోజు నాడు అమ్మకు ఫోటోషూట్ చేయించడం అలవాటు. అలా ఒకసారి మా ఫ్యామిలీ ఫ్రెండ్ అయినా భువన గౌడ తో ఫోటోషూట్ చేయించగా.. ఆయన నా ఫోటోలను ఫేస్బుక్లో షేర్ చేశారు. ఇక వాటిని చూసిన ఒక కన్నడ డైరెక్టర్ నాకు ఆఫర్ ఇచ్చారు. అలా స్కూల్ డేస్ లో ఉన్నప్పుడే కన్నడ సినిమాలో నటించి ఇండస్ట్రీ రంగ ప్రవేశం చేయడం జరిగింది. ఇక ఆ తర్వాత నాకు డాక్టర్ కావాలన్న కోరిక ఉండడం వల్లే కొద్దిరోజులు సినిమాలను పక్కన పెట్టి ఎంబిబిఎస్ పూర్తి చేసే పనిలో పడ్డాను. ఇప్పుడు చివరి సంవత్సరం చదువుతున్నాను అంటూ తెలిపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version