కాంగ్రెస్ ఫిర్యాదుతోనే ఈసీ రైతుబంధును ఆపింది : హరీశ్ రావు

-

తెలంగాణలో రైతుబంధు నిధుల విడుదల అనుమతిని కేంద్ర ఎన్నికల సంఘం వెనక్కి తీసుకోవడం ఇప్పుడు రాజకీయ రగడను రాజేస్తోంది. అధికార బీఆర్ఎస్ వల్లే ఈసీ ఈ నిర్ణయం తీసుకుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తుంటే.. కాంగ్రెస్ ఫిర్యాదు వల్లే ఇలా జరిగిందంటూ బీఆర్ఎస్ ధ్వజమెత్తుతోంది. తాజాగా ఈ వ్యవహారంపై రాష్ట్ర మంత్రి హరీశ్ రావు స్పందించారు.

రైతుబంధు ఇచ్చేందుకు 3 రోజుల క్రితం అనుమతి ఇచ్చిన ఈసీ.. కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేయడంతో ఇప్పుడు అనుమతిని ఆపిందని హరీశ్ రావు అన్నారు. రైతుబంధు మీద కాంగ్రెస్‌ కుట్రలను తిప్పికొట్టాలని ప్రజలకు సూచించారు. కాంగ్రెస్‌ నేతలు ఈసీకి ఫిర్యాదు చేసి వచ్చే రైతుబంధును ఆపారని ఆరోపించిన మంత్రి.. ఆ పార్టీ అధికారంలోకి వస్తే .. రైతుబంధు ఖతం అవుతుందని తెలిపారు.

“కర్ణాటకలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదు. ఇచ్చిన హామీలను నెరవేర్చిన ముఖ్యమంత్రి కేసీఆ. కేసీఆర్‌ మళ్లీ గెలిస్తే.. వృద్ధాప్య పింఛను రూ.5 వేలకు పెంచుతారు. బీజేపీ ప్రభుత్వం గ్యాస్‌ సిలిండర్‌ను రూ.వెయ్యికి పెంచింది. బీఆర్ఎస్ మళ్లీ గెలిస్తే.. రూ.400కే గ్యాస్‌ సిలిండర్‌ ఇస్తాం. బీఆర్ఎస్ మళ్లీ గెలిస్తే.. రేషన్‌కార్డుపై సన్నబియ్యం ఇస్తాం. పెండింగ్‌ ఉన్న ఒకట్రెండు హామీలను మళ్లీ గెలిపిస్తే అమలు చేస్తారు.” అని హరీశ్ రావు అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version