రైతుబంధు విషయంలో కాంగ్రెస్‌, బీఆర్ఎస్ నాటకం ఆడుతున్నాయి : కిషన్ రెడ్డి

-

రాష్ట్రంలో రైతుబంధు నిధుల విడుదలపై ఈసీ తాజా నిర్ణయం రాజకీయ చిచ్చు రేపింది. బీఆర్ఎస్​ వల్లే నిధుల విడుదల నిలిచిపోయిందని కాంగ్రెస్​.. హస్తం పార్టీ ఫిర్యాదుతోనే ఇలా జరిగిందని బీఆర్ఎస్.. అసలు బీఆర్ఎస్, బీజేపీ ఆడుతున్న నాటకం వల్లే రైతులు నష్టపోతున్నారంటూ బీజేపీ పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ వ్యవహారంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పందించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్‌ ఒకేతాను ముక్కలు అని.. ఆ రెండు పార్టీలు కలిసి రైతుబంధు విషయంలో నాటకం ఆడుతున్నాయని విమర్శించారు. ఎన్నికల నోటిఫికేషన్‌ కంటే ముందే రైతుబంధు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.

“కుటుంబ పార్టీలను బీజేపీ ఎప్పటికీ వదిలిపెట్టదు. కాంగ్రెస్‌, బీఆర్ఎస్ మీద మా పోరాటం ఆగదు. కాంగ్రెస్‌, బీఆర్ఎస్ కలిసి నాటకం ఆడుతున్నాయి. రైతుబంధు విషయంలోనూ కాంగ్రెస్‌, బీఆర్ఎస్ నాటకం ఆడుతున్నాయి. బీజేపీ గెలిస్తే.. కచ్చితంగా హైదరాబాద్‌ పేరు మారుస్తాం. హైదర్‌ ఎవరు… ఆ పేరు ఇంకా ఎందుకు ఉండాలి. హైదరాబాద్‌ పేరును భాగ్యనగరంగా మారుస్తాం. ఇప్పటికే దేశంలో అనేక నగరాల పేర్లు మారాయి. ముస్లింలకు బీజేపీ వ్యతిరేకం కాదు, పాతబస్తీని అభివృద్ధి చేయాలని మేం డిమాండ్‌ చేస్తున్నాం. నిజాయితీ ఉన్నవాళ్లైతే ఐటీ తనిఖీలకు ఎందుకు భయపడుతున్నారు.” అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version