సహాయం చేయాల్సిన సీఎం బురుద వేస్తున్నారు : హరీష్ రావు

-

వరదలొస్తే సీఎం రేవంత్ రెడ్డి సహాయం చెయ్యకుండా మాపై బురుద వేస్తున్నారు అని సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న మాపై విమర్శలు చెయ్యడమే సీఎంకు పని. ఖమ్మం జిల్లాలో వరద సహాయక చర్యల్లో ముగ్గురు మంత్రులు ఫెయిల్ అయ్యారు. 74 ఏళ్ళు ఉన్న ఏపీ సీఎం బయట తిరుగుతుంటే, 54 ఏళ్ళు ఉన్న మన సీఎం ఇంట్లో ఉన్నాడు.వాతావరణ శాఖ చెప్పిన కూడా ముందస్తు చర్యలు చెయ్యలేదు.

వరదల్లో 16 మంది చనిపోయారని చెబుతున్నారు. కానీ 31 మంది చనిపోయారు అని మాకు సమాచారం ఉంది. ఖమ్మం లో తొమ్మిది సీట్లు ఇస్తే, తొమ్మిది మందిని కూడా కపడలేకపోయారు. ఇప్పటికైనా బుద్ది తెచ్చుకొని , తప్పులు సరిదిద్దుకో, ఆపదలో ఉన్న వారిని కాపాడండి. మీరు ప్రతిపక్షం లో ఉన్నప్పుడు చనిపోయిన వ్యక్తులకు 25 లక్షలు అడిగిన మీరు ఇప్పుడు చనిపోయిన వ్యక్తులకు 25 లక్షలు ఇవ్వండి. ఖమ్మంలో సహాయం అడిగిన బాధితులపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ప్రజాపాలన అంటే లాఠీ ఛార్జ్ చెయ్యడమా అని ప్రశ్నించారు హరీష్ రావు.

Read more RELATED
Recommended to you

Exit mobile version