తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలోనే మరో భారీ నోటిఫికేషన్

-

తెలంగాణ నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది కేసీఆర్‌ సర్కార్‌. ఈ మేరకు తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు కీలక ప్రకటన చేశారు. 663 ఉద్యోగాల భర్తీ కోసం గ్రూప్-2 నోటిఫికేషన్, గ్రూప్-3 లో 1,373 ఉద్యోగాలు త్వరలో భర్తీ చేయనున్నట్టు వెల్లడించారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసినట్టు స్పష్టం చేశారు.

ఇవే కాకుండా వ్యవసాయం, పశుసంవర్ధక శాఖలో ఖాళీలను భర్తీ చేయడానికి ఆదేశాలు జారీ చేసినట్టు చెప్పారు. మిగిలిన నోటిఫికేషన్లను కూడా త్వరలో జారీ చేస్తామని స్పష్టం చేశారు. తెలంగాణలో ఇప్పటివరకు జారీ చేసిన ఉద్యోగ నోటిఫికేషన్లు, 50వేల మైలురాయిని దాటిందని మంత్రి హరీష్ రావు వెల్లడించారు.

సీఎం కేసీఆర్ వాగ్దానం చేసినట్లుగా, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా 2 వేల 910 పోస్టులు భర్తీకి ఉత్తర్వులు జారీ చేసినట్టు వివరించారు. గడిచిన 3 నెలల్లో ఇప్పటివరకు 52 వేల 460 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వచ్చాయని చెప్పారు. ఉద్యోగార్ధులందరికీ శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు.

Read more RELATED
Recommended to you

Exit mobile version