నాగర్ కర్నూల్ జిల్లా చారకొండలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. నిరసన చేస్తున్న చిన్న పాపను సైతం పోలీసు వాహనాల్లో తరలిస్తున్నారు పోలీసులు. ప్రధానంగా జడ్చర్ల-కోదాడ 167 వ రహదారి నిర్మాణ పనుల్లో భాగంగా బైపాస్ రోడ్డు కోసం చారకొండలో 29 ఇండ్లను కూలగొట్టడానికి సిద్ధం అయ్యారు అధికారులు. దీంతో పోలీసు బలగాలతో జేసిబిలతో వచ్చిన అధికారులు బైపాస్ కోసం మా ఇండ్లు కూలగొట్టొద్దు అని బాధిత కుటుంబాలు నిరసనలు చేస్తున్నారు.
మరోవైపు చారకొండలో కళ్ళ ముందే తమ ఇల్లు కూల్చి వేస్తుండడంతో కన్నీరు మున్నీరుగా విలపించారు వృద్ధ దంపతులు. దీంతో సోమసిల్లి పడిపోయిన వృద్ధురాలు ని 108 లో ఆసుపత్రికి తరలించారు వైద్య సిబ్బంది. రహదారి పనుల కోసం దారికి అడ్డంగా ఉన్నా ఏదైనా కూల్చివేస్తారని అధికారులు చెప్పడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. కొందరూ రోధిస్తూ ప్రభుత్వం పై విరుచుకుపడటం గమనార్హం.
చారకొండలో కళ్ళముందే తమ ఇల్లు కూల్చివేస్తుండడంతో కన్నీరు మున్నీరుగా విలపించిన వృద్ధ దంపతులు
సోమసిల్లి పడిపోయిన వృద్ధురాలు
108 లో ఆసుపత్రికి తరలించిన వైద్య సిబ్బంది https://t.co/0US8ITZ2Wm pic.twitter.com/bnzH5WK7bD
— Telugu Scribe (@TeluguScribe) February 4, 2025