Harish Rao wrote an open letter to Deputy CM Bhatti Vikramarka: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు బహిరంగ లేఖ రాశారు హరీష్ రావు. బెస్ట్ అవైలబుల్ స్కూళ్ళ (BAS) పథకానికి ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు బహిరంగ లేఖ రాశారు హరీష్ రావు. పెండింగ్‌లో ఉన్న 80 కోట్ల BAS పథకం నిధులతో పాటు, ఈ ఏడాది 130 కోట్లు కూడా విడుదల చేయని కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ ఫైర్ అయ్యారు.
25 వేల మంది పేద విద్యార్థులకు ఉచితంగా ప్రైవేట్ స్కూళ్లలో చదువుకునే బెస్ట్ అవైలబుల్ స్కూళ్ళ (BAS) పథకానికి ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని లేఖ రాశారు హరీష్ రావు. తమ కుటుంబాలలో చదువుకుంటున్న తొలి తరం వారు ఎక్కువ మంది జోగిని వ్యవస్థకు గురైన వారి పిల్లలు, రెక్కాడితేగాని డొక్కాడని కూలీల పిల్లలు. పేద విద్యార్థులకు లబ్ధి చేకూర్చే ఇలాంటి పథకానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడం బాధాకరమన్నారు.