సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్ రావు కౌంటర్..!

-

హన్మకొండ ఆర్ట్స్ కాలేజీలో కాంగ్రెస్ విజయోత్సవ సభలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా కేసీఆర్ తాగుబోతు అధ్యక్షుడు అని, తాగుబోతులకు బ్రాండ్ అంబాసిడర్ అని కేసీఆర్ మొక్కను మొలవబోనియ్యనని ఇలా పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనికి స్పందించిన మాజీ మంత్రి హరీశ్ రావు ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. శాతగానోనికి మాటలెక్కువ, చేవలేనోనికి బూతులెక్కువ అన్నట్లు ఉంది రేవంత్ రెడ్డి పరిస్థితి. పదకొండు నెలల పాలనలో ఆయన నోటి నుండి బూతులు తప్ప నీతులు రాలేదు. కాంగ్రెస్ విజయోత్సవ సభ అని పేరు పెట్టుకొని చేసింది ఏమీ లేక, చెప్పుకోవడానికి ఏమీ లేక ఎప్పటి లాగే పిచ్చి మాటలు వదిలిండు. ఇక నువ్వు ఎంత గింజుకున్నా లాభం లేదు. అశోక్ నగర్ నుంచి లగచర్ల దాకా, రైతుల నుండి లంబాడి బిడ్డల దాకా నువ్వు చేసిన ఘోరాలు సమసిపోవు. తెలంగాణ ప్రజలు మరిచిపోరు.

“నువ్వు కేసీఆర్.. కేసీఆర్.. అంటూ కేసీఆర్ గారి నామస్మరణ చేసినంత మాత్రాన నీ పాపం పోదు. కేసీఆర్ గారి వంటి గొప్ప వ్యక్తి జీవితంలో అర్థం కాడు. తొక్కుకుంటూ తొక్కుకుంటూ వచ్చానని గప్పాలు కొడుతున్నవు. అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ నాయకులను తొక్కినవు. షార్ట్ కట్ లో అధికారం చేజిక్కించుకొని ప్రజలను తొక్కుతున్నవు. నీ వదురుబోతు తనంతో రాష్ట్రానికి ఒరిగేది ఏమీ లేదు. నీ దుర్భాషను ప్రజల విచక్షణకే వదిలేస్తున్నాం” అంటూ ట్వీట్ చేశారు హరీశ్ రావు.

Read more RELATED
Recommended to you

Exit mobile version