ప్రపంచంలో ఉన్నటువంటి ఏడు వింతల తర్వాత ఎనిమిదో వింత సృష్టించిన ఘనత బీఆర్ఎస్, బీజేపీ దే అని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. కేవలం బీజేపీ – బీఆర్ఎస్ నిస్సిగ్గుగా పెనవేసుకుని ఫ్రెండ్ షిప్ చేస్తే తప్ప ఈ ఎనిమిదో వింత సాధ్యం కాదు అని ఆయన పేర్కొన్నారు. ఆరోపణలో నీచత్వానికి పరాకాష్ఠ ఇది. కొడంగల్ ఫార్మా సెజ్ లేదా.. ఇండస్ట్రియల్ హబ్.. పేరు ఏదైనా.. ఇంత వరకు భూ సేకరణ పూర్తి కాలేదు.
అసలు ఇంకా జరగని భూ సేకరణలో.. సెజ్ ఏర్పాటుకు అనుమతులు ఇవ్వలేదు అనడం.. ఆ ఇవ్వని అనుమతుల్లో సీఎం గారి అల్లుడు కంపెనీకి భూములు ఇచ్చారు అని చెప్పడం.. ఆ ఇవ్వని భూముల పై కేసులు పెట్టారనడం.. అసలు ఏమన్నా అర్థం పరమార్థం ఉందా అని బీఆర్ఎస్, బీజేపీ నాయకులను ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు ఎంపీ చామల.