తెలంగాణ అసెంబ్లీలో మంత్రి పొంగులేటి సుధాకర్ రెడ్డి భూ భారతి 2024-బిల్లు ను ప్రవేవపెట్టిన విషయం తెలిసిందే. వెంటనే రూల్స్ సస్పెండ్ చేసి భూ భారతి బిల్లు పై చర్చ ప్రారంభించారు. ఈ వ్యవహారం పై కలుగజేసుకున్న మాజీ మంత్రి హరీశ్ రావు బిల్లుకు సంబంధించిన కాపీలు కూడా అందించకుండా ఎలా చర్చించాలని స్పీకర్ ను ప్రశ్నించారు. బీఏసీ సమావేశంలో కూడా సభ నిర్వహణ సమయానికి సంబందించిన వివరాలను అందించలేదని తెలిపారు.
ముఖ్యంగా సభలో ఏఏ బిల్లులను ప్రవేశపెట్టబోతున్నారో ముందస్తుగా తెలపలేదని.. కాంగ్రెస్ సభ్యులకు ఇష్టం వచ్చినప్పుడు బిల్లును పెట్టి రూల్స్ ను సస్పెండ్ చేసి బిల్లును ప్రవేశ పెట్టిన వెంటనే చర్చించడం ఏంటి..? అని ప్రశ్నించారు. ఇవాళ సభలో ప్రవేశ పెట్టిన బిల్లు పై చర్చించేందుకు సమయం ఇవ్వాలని.. తాము కూడా బిల్లును పూర్తిగా చదివి.. తమ వంతు సలహాలు,సూచనలు చేస్తామని.. ఇందుకు ప్రతీ సభ్యుడికి సమయం కావాలని హరీశ్ రావు స్పీకర్ ను కోరారు.