మహిళలకు రూ.2,500 ఇస్తానన్న హామీ నెరవేరిందా..? : ప్రధాని మోడీ

-

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందని.. మహిళలకు రూ.2,500 ఇస్తానన్న హామీ నెరవేరిందా..? అని భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రశ్నించారు. వరంగల్ లో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు ప్రధాని మోడీ. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి డిసెంబర్ 09న అధికారంలోకి రాగానే రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి.. దానిని ఆగస్టు 15వరకు మార్చారు. ఇది మాట తప్పడం కాదా..? ఓవైపు  వేములవాడ రాజన్న మీద ఒట్టు పెడుతున్నారు.. మరోవైపు సనాతాన ధర్మాన్ని తిడుతున్నారు.

కాంగ్రెస్ అబద్దాలు ఎలా ఉంటాయో తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు. వరంగల్ ను కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి కాపాడాలి అన్నారు. ఎక్కడ అధికారంలో ఉంటే.. ఆ రాష్ట్ర సంపదను ఇండియా కూటమి దోచుకుంటుంది. మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వకూడదనే సూత్రాన్ని కాంగ్రెస్ పాటించడం లేదన్నారు. మూడో విడత ఎన్నికల్లో బీజేపీ విజయం వైపు చూస్తోంది. కాంగ్రెస్ ఎక్కడ గెలుస్తామని భూతద్దం పెట్టుకొని చూస్తుందన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version