కామారెడ్డిలో తాను కూలి పని చేశా : సీఎం కేసీఆర్

-

బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ కామారెడ్డి అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు. అంతకుముందు గజ్వేల్‌లో నియోజకవర్గంలో నామినేషన్‌ దాఖలు చేసిన సీఎం.. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో కామారెడ్డికి చేరుకున్నారు. అనంతరం పలువురు బీఆర్‌ఎస్‌ నాయకులతో కలిసి రోడ్డు మార్గంలో రిటర్నింగ్‌ అధికారి కార్యాలయానికి వెళ్లి నామినేషన్‌ వేశారు. అనంతరం ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. గత ఎన్నికల్లో కామారెడ్డిని జిల్లా చేస్తామని హామీ ఇచ్చామని.. ఇప్పుడు చేశామని తెలిపారు కేసీఆర్.

కేసీఆర్ ఒక్కడే రాడు.. ఆయన వెంట కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాలకు కాళేశ్వరం నీళ్లు వస్తాయని చెప్పారు. కామారెడ్డిలో తాను కూలీ పని చేశానని గుర్తు చేశారు సీఎం కేసీఆర్. తన వెంట విద్యుత్, ఎడ్యూకేషన్ సంస్థలు వస్తాయి. పల్లెలు, పట్టణాలు మారిపోతాయి. అన్నింటిని బాగు చేసే బాద్యత నాదే అన్నారు. కామారెడ్డి నుంచి పోటీ చేయాలని ఇక్కడి నాయకులు కోరారు. కామారెడ్డి అభివృద్ధి కోసం తాను ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నానని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version