హుస్సేన్‌సాగర్‌లో వినాయక విగ్రహాల నిమజ్జనంపై నేడు హైకోర్టులో విచారణ జరుగనుంది. హుస్సేన్‌సాగర్‌లో వినాయక విగ్రహాలు నిమజ్జనం చేయకూడదన్న హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలని పిటిషనర్ పేర్కొన్నారు. హైడ్రాను ప్రతివాదిగా చేర్చాలని కోరారు పిటిషనర్.
ఈ తరుణంలోనే హుస్సేన్‌సాగర్‌లో వినాయక విగ్రహాల నిమజ్జనంపై నేడు హైకోర్టులో విచారణ జరుగనుంది. ఈ పిటిషన్ పై జస్టిస్ వినోద్ కుమార్ తో కూడిన బెంచ్ ఇవాళ విచారణ జరుపుతుందని తెలిపింది హైకోర్టు. అయితే అనేక రసాయనాలు కలిసిన రంగులతో తయారు చేయబడిన వేల కొద్ది గణేష్ విగ్రహాలు హుస్సేన్ సాగర్ లో నిమర్జనం చేయడం వల్ల అధికంగా కలుషితం అవుతుందని.. ఈ నేపథ్యంలో హుస్సేన్ సాగర్ లో వినాయక నిమర్జనాలు చేయరాదంటూ గత ఏడాది హైకోర్టు తీర్పును వెలువరించింది. మరి ఈ ఏడాది వినాయక నిమర్జనాలు హుస్సేన్ సాగర్ లో ఉంటాయో..? లేదో..? అన్నది ఇవాళ కోర్టులో తేలనుంది.