వినాయక చవితి పండుగ ప్రాముఖ్యత, విశిష్టత తెలుసా..?

-

వినాయకుడుని ఆరాధించడం వలన మనం చేసే ఏ పనుల్లో కూడా విఘ్నాలు ఆటంకాలు ఉండవని హిందువులు నమ్ముతారు. హిందువులు జరుపుకునే పండుగల్లో వినాయక చవితి ఒకటి. వినాయక చవితిని మూడు నుంచి 11 రోజుల పాటు చేస్తారు. ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు వినాయక చవితిని జరుపుకుంటారు. వినాయక చవితి భాద్రపద మాసంలో వస్తుంది. అయితే ఎప్పుడైనా వినాయక చవితి ఎందుకు ఈ మాసంలో వస్తుంది అనే దాని గురించి ఆలోచించారా..? ఈ పండుగ విశిష్టత, ప్రత్యేకత గురించి కూడా కొన్ని విషయాలు తెలుసుకుందాం. చాలా మంది పాశ్చాత దేశాలని అనుసరిస్తున్నారు. మన పూర్వీకులు పాటించిన పద్ధతుల్ని కొంతమంది కొట్టి పారేస్తున్నారు.

ప్రస్తుతం మనం వినాయక చవితి గురించి తెలుసుకుందాం.. వినాయక చవితిని భాద్రపద మాసంలో వచ్చే మొదటి చవితి రోజు జరుపుకుంటారు. ఆరోజు మట్టితో వినాయకుడి ప్రతిమను చేస్తారు. అలాగే పసుపు ముద్దతో వినాయకుడిని చేసి అక్కడే దీన్ని కూడా పెట్టి పూజిస్తారు. 21 రకాల ఆకుల్ని ఉపయోగించి పూజ చేస్తారు. పూజకి ఉపయోగించే ప్రతి ఆకు ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. అలాగే ఆవిరిపైన చేసే వంటకాలను నైవేద్యంగా పెడతారు.

అయితే ఆవిరి పైన చేసిన వంటకాలను నైవేద్యంగా పెట్టడం వెనుక కారణం ఉంది. భాద్రపద మాసం అంటే ఆగస్టు, సెప్టెంబర్లలో వస్తుంది. వర్షాలు ఎక్కువగా కురుస్తాయి. దీని వలన అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. జలుబు, జ్వరం వంటి వ్యాధులు వస్తాయి మనిషిలో వ్యాధి నిరోధక శక్తి కూడా తగ్గుతుంది. అందుకని వినాయక పూజకు పత్రిలో జిల్లేడు, తులసి మొదలైన ఆకుల్ని ఔషధంగా ఉపయోగిస్తారు. ఆవిరిపైన వండిన ఆహారాలు ప్రసాదంగా తీసుకోవడం వలన జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version