సుప్రీం కోర్టులో కవిత రిట్ పిటిషన్ పై ఇవాళ విచారణ జరుగనుంది. ఈ కేసును జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సుందరేష్, బేలా ఎం త్రివేది ల సోషల్ బెంచ్ విచారణ జరపనుంది. తన అరెస్ట్ అక్రమం అని కోర్టును ఆశ్రయించారు కవిత. ఈ మేరకు రిట్ పిటిషన్ దాఖలు చేశారు కల్వకుంట్ల కవిత. ఇక ఇవాళ కోర్టు ప్రారంభం కాగానే కవిత కేసు విచారణ జరిగే అవకాశం ఉంది.
కాగా ఈడీ కస్టడీలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను గురువారం సాయంత్రం ఆమె తల్లి శోభ, సోదరుడు కేటీఆర్, రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ సోదరి సౌమ్య కలిశారు. కోర్టు ఇచ్చిన అనుమతి ప్రకారం సాయంత్రం 7 నుంచి 8 గంటలవరకు వారు ఆమెతో మాట్లాడారు. ఈ సందర్భంగా కవిత యోగక్షేమాలు, ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఆరు రోజులుగా ఆమె ఈడీ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే.