తెలంగాణను వరుణుడు వెంటాడుతున్నాడు. ఇప్పటికే భారీ వర్షాలు, వరదలతో రాష్ట్రం అతలాకుతలం అయింది. జనజీవనం స్తంభించింది. ఇది చాలదన్నట్లు మరో మారు రాష్ట్రానికి వాన గండం పొంచి ఉంది. బంగాళాఖాతంలో తాజాగా ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. దీంతో తెలంగాణలో వచ్చే మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది.
ముఖ్యంగా హైదరాబాద్, అదిలాబాద్, జగిత్యాల, భూపాలపల్లి, గద్వాల, కొమరం భీం, మహబూబ్ నగర్ జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే మంచిర్యాల, మెదక్, మల్కాజిగిరి, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణపేట, నిర్మల్ జిల్లాలలో మోస్తరు వర్షాలు.
ఇక పెద్దపెల్లి, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వనపర్తి, యాదాద్రి, వికారాబాద్ జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో అప్రమత్తమైన ఉన్నతాధికారులు.. గ్రామాలు, మండలాల అధికారులను అప్రమత్తం చేశారు.