టీ – సేవ్ ఫోరం ఆధ్వర్యంలో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్, నిరుద్యోగ సమస్యలపై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నిర్వహించాలనుకున్న దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించిన విషయం తెలిసిందే. ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతాయని అనుమతిని నిరాకరించారు పోలీసులు. దీంతో హైకోర్టుని సంప్రదించారు వైయస్ షర్మిల.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగాల సాధనే లక్ష్యంగా, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్ని పార్టీల ఆధ్వర్యంలో జరగనున్న టీ – సేవ్ నిరాహార దీక్షకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే కొన్ని షరతులతో కూడిన అనుమతిని ఇచ్చింది హైకోర్టు. ఇందిరాపార్కు వద్ద చేపట్టే ఈ నిరాహార దీక్షకు 500 మంది కంటే ఎక్కువగా పాల్గొనవద్దని, అలాగే దీక్షకు 48 గంటల ముందు పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించింది.