తెలంగాణ రాష్ట్ర హై కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కోర్టులలో ఈ నెల 14 నుంచి ప్రత్యేక విచారణలు చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. కాగ కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువ ఉన్న నేపథ్యంలో ప్రత్యేక విచారణలు ను హై కోర్టు పూర్తిగా ఎత్తేసింది. జనవరి 17 వ తేదీ నుంచి ఈ నెల 4 వరకు ఆన్ లైన్ లోనే విచారణ చేపట్టాలని హై కోర్టు ఆదేశించింది.
ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కోర్టులలో ఆన్ లైన్ లోనే కేసుల విచారణ జరిగింది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా వ్యాప్తి భారీగా తగ్గింది. దీంతో ఇప్పటి వరకు జరుగుతున్న ఆన్ లైన్ విచారణను తొలగిస్తు నిర్ణయం తీసుకుంది. అలాగే ఈ నెల 14 నుంచి పూర్తిగా ప్రత్యేక విచారణలనే చేపట్టాలని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కోర్టులకు హై కోర్టు ఆదేశాలను జారీ చేసింది. ఈ నెల 13 వరకు ఆన్ లైన్ లోనే విచారణలను చేపట్టాలని హై కోర్టు తెలిపింది. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసే కరోనా నిబంధనలను మాత్రం తప్పక పాటించాలని హై కోర్టు సూచించింది.