తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్ట్ షాక్ ఇచ్చింది. తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో కమ్యూనిటీ
భవనాలకు భూకేటాయింపులు జరపడంపై కీలక నిర్ణయం తీసుకుంది. ఆ భూముల్లో నిర్మాణాలు చేపట్టకూడదని ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. నగరంలో బలిజ, కాపు, వెలమ, కమ్మ సంఘాలకు భూ కేటాయింపులు జరపడం పట్ల హైకోర్టు లో పిటిషన్ దాఖలైంది. కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కుల సంఘాలకు కట్టబెట్టడం కరెక్ట్ కాదని, వెంటనే ఆ జీవో కొట్టివేస్తూ ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్ పేర్కొన్నారు.
ఈ పిటిషన్ పై నేడు విచారణ చేపట్టిన కోర్ట్.. ఆయా భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని
సర్కార్ కు నోటీసులు జారీ చేసింది. కాగా ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయడానికి ప్రభుత్వ
న్యాయవాది కొంత సమయం కోరగా.. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది కోర్టు.