వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వ.. పిటిషన్ పై హైకోర్టు తీర్పు వెల్లడించిననున్న విషయం తెలిసిందే. అయితే గత ఆరేళ్లుగా హైకోర్టులో వాదనలు కొనసాగాయి. చెన్నమనేని రమేష్ పౌరసత్వాన్ని రద్దు చేయాలని హైకోర్టులో వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వంపై హైకోర్టు తీర్పు వాయిదా వేసింది. చెన్నమనేని రమేష్ ఏ పాస్ పోర్టుపై ట్రావెల్ చేస్తున్నారని ప్రశ్నించింది హైకోర్టు. అయితే జర్మనీ పాస్ పోర్టుపై ట్రావెల్ చేస్తున్నారని కోర్టుకు తెలిపారు చెన్నమనేని లాయర్. దీంతో ఇండియన్ పాస్ పోర్ట్ ఉందా..?ఝ అని ప్రశ్నించింది కోర్టు. దీంతో లేదని న్యాయవాది సమాధానం చెప్పారు. దీంతో అన్ని వాదనలను పరిగణనలోకి తీసుకున్నామని.. తీర్పు రేపటికి వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. చెన్నమనేనికి ఇండియా పౌరసత్వం లేదా..? ఇండియా పౌరసత్వం, పాస్ పోర్టు లేకుండానే ఎమ్మెల్యేగా కొనసాగారా..? అంటూ రకరకాల ప్రశ్నలు ఉత్పన్నం కావడం విశేషం.