ప్రతి ఒక్కరికి కూడా లైఫ్ లో సక్సెస్ అవ్వాలని ఉంటుంది. కానీ అందరూ సక్సెస్ ని అందుకోలేరు. సక్సెస్ అవ్వాలంటే కొన్ని త్యాగం చేయక తప్పదు. చిన్నవయసులో చెప్పినా చాలామంది చెవికెక్కించుకోరు. మనం అనుకున్నది సాధించాలంటే కచ్చితంగా కొన్ని అనవసరమైన వాటిని విడిచి పెట్టాలి. 23 ఏళ్ల వ్యాపారవేత్త షేర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఆయన సక్సెస్ కి గల కారణాలు కూడా ఆ పోస్టులో రాసుకు వచ్చారు. ఆ పోస్టులో ఢిల్లీ కి చెందిన వ్యాపారవేత్త అయినటువంటి కుశల్ అరోరా తను పడిన కష్టాన్ని వివరించారు.
ఎక్కువసేపు వర్క్ చేయడం.. ఎన్నో నిద్రలేని రాత్రులు గడపడం తన డ్రీమ్ లైఫ్ కి కారణం అని చెప్పుకొచ్చారు. 23 ఏళ్ల వయసులో ఐదు లక్షల డాలర్లని ఏడాదికి సంపాదిస్తున్నట్లు చెప్పారు. నా వయసు వాళ్ళు పార్టీలు చేసుకుంటే నేను మాత్రం నిద్రలేని రాత్రులు గడిపానని.. సోషల్ ఆక్టివిటీస్ ని మిస్ అయ్యానని చెప్పారు.
ఆ నిర్ణయం తీసుకోవడం వలన ఇప్పుడు జీవితం ఇలా ఉందంటూ అయినా షేర్ చేసుకోవడం జరిగింది. దీనిపై ఒక యూజర్ కామెంట్ చేస్తూ మీరు మీ జీవితాన్ని గడతారు. వాళ్ళు జీవితాన్ని గడిపారు. ప్రతి ఒక్కరికి అంత సంపాదించాలని కల ఉండదు. కాంపిటీషన్ చేయక్కర్లేదు అంటూ కామెంట్ చేశారు. మరొకరు కామెంట్ చేస్తూ ఇది మీకు వర్క్ అవుట్ అయిందని అందరికీ వర్క్ అవుట్ అవ్వాలని లేదు అని కామెంట్ చేశారు ఏదేమైనాప్పటికీ అనుకున్న జీవితాన్ని గడపాలంటే కొన్ని కొన్ని సార్లు కొన్ని త్యాగాలు చేస్తేనే సక్సెస్ అవ్వగలము.
I’m 23yrs old earning over $5,00,000 annually.
When students of my age were partying & chilling, I was:
– Having sleepless nights working
– Missing social events
– Dealing with failures/rejection
– Losing work-life balanceBut I chose that. Are you building your dream life?
— Kushal Arora (@digitalkushal) October 16, 2024