నేడు తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు

-

తెలంగాణ ఎంసెట్​ పరీక్ష ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు వెల్లడిస్తామని మంగళవారం ప్రకటించిన అధికారులు.. అదే సమయంలో కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ సమావేశం ఉండటం, దానికి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరుకావాల్సి ఉండటంతో ఫలితాల విడుదల సమయాన్ని ముందుకు జరిపారు.

ఎంసెట్‌ ఫలితాలను https://eamcet.tsche.ac.in/ తదితర వెబ్‌సైట్ల ద్వారా తెలుసుకోవచ్చు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీని ఎంటర్ చేసి ర్యాంకులు చెక్ చేసుకోవచ్చు. ఫలితాల తర్వాత విడతల వారీగా కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. అభ్యర్థికి వచ్చిన ర్యాంకు, కోర్సు, కళాశాల, అందుబాటులో ఉన్న సీట్ల ఆధారంగా అడ్మిషన్ కేటాయిస్తారు. సీటు కేటాయించిన తర్వాత.. సదరు అభ్యర్థి సంబంధిత కాలేజీకి వెళ్లి రిపోర్ట్ చేయాలి.

తెలంగాణలో ఫిబ్రవరి నెల 28న ఎంసెట్​ నోటిఫికేషన్​ను ప్రభుత్వం విడుదల చేసింది. మే 10 నుంచి 14 వరకు ఈ పరీక్ష నిర్వహించారు. దీనికి సంబంధించిన కీను ఇప్పటికే ప్రభుత్వం విడుదల చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version