తెలంగాణ హోం శాఖ మంత్రి మహమూద్ ఆలీ మొన్న ఓ వివాదంలో చిక్కు కున్నారు. తెలంగాణ హోం శాఖ మంత్రి మహమూద్ ఆలీ తన గన్ మెన్ పై చేయి చేసుకున్నారు. తలసాని పుట్టినరోజు వేడుకలకు హాజరైన మహమూద్ ఆలీ… బొకే ఎక్కడ అంటూ గన్ మెన్ పై అగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో సహనం కోల్పోయి గన్ మెన్ చెంప చెల్లుమనిపించారు. దీంతో షాక్ అయిన సదరు గన్మెన్ మంత్రిని అలాగే చూస్తుండి పోయారు.
ఆ పై వెనుక ఉన్న వ్యక్తుల దగ్గర నుంచి బొకే తీసుకుని మంత్రికి అందించారు. ఈ సంఘటనపై తీవ్ర వ్యతిరేకంత వచ్చింది. దీంతో ..మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా గన్ మెన్ ను చెంపపై కొట్టిన వివాదంపై హోం మంత్రి మహమూద్ స్పందించారు. ‘ఈ ఘటన అనుకోకుండా జరిగింది. అందుకు చింతిస్తున్న. క్షమించండి. నాకు రక్షణగా ఉన్న వారిని సొంతబిడ్డలా చూసుకుంటున్న’ అని వివరణ ఇచ్చారు. అటు హోం మంత్రిపై చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.