బిర్యానీ సగమే ఉడికిందన్నందుకు.. కస్టమర్లపై హోటల్ సిబ్బంది దాడి

-

న్యూ ఇయర్ వేడుకల్లో భాగ్యనగరమంతా బిజీగా ఉన్న సమయంలో అబిడ్స్లోని ఓ హోటల్ వద్ద మాత్రం గొడవ చోటుచేసుకుంది. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా హోటల్లో బిర్యానీ తిందామని వెళ్లిన కస్టమర్లకు సిబ్బంది ఉడికీఉడకని బిర్యానీ వడ్డించగా వారు ప్రశ్నించారు. దీంతో హోటల్ సిబ్బంది కస్టమర్లపై దాడికి తెగబడ్డారు.

పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. ధూల్‌పేట్‌లోని గంగాబౌలి ప్రాంతానికి చెందిన 8 మంది కుటుంబసభ్యులు న్యూ ఇయర్ సందర్భంగాబిర్యానీ తినేందుకు అబిడ్స్‌లోని గ్రాండ్‌ హోటల్‌కు వెళ్లి మనట్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చారు. వెయిటర్లు తీసుకొచ్చిన బిర్యానీ సగమే ఉడికి ఉండటంతో తినేందుకు నిరాకరించగా వెయిటర్లు వేడిచేసిన బిర్యానీ తీసుకొచ్చి తినాల్సిందిగా కోరారు. సగం ఉడికిన బిర్యానీ ఇచ్చారు కాబట్టి డిస్కౌంట్‌ ఇవ్వాలని కస్టమర్లు పట్టుబట్టగా ఆగ్రహించిన వెయిటర్లు వారిపై కర్రలతో దాడి చేశారు. బాధితుడు సుమిత్‌సింగ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హోటల్‌ యాజమాన్యంపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ నరసింహరాజు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version