సెల్ఫి వీడియో తీసుకుని గృహిణి ఉరి వేసుకుని అత్మహత్య చేసుకున్న ఘటన సంచలనంగా మారింది. ఆమె పిల్లల కళ్ళ ముందే ఆత్మహత్య చేసుకోవడం సంచలనం అయింది. ఆఖరి నిమిషంలో తమ తల్లి వేలాడటం చూసిన పిల్లలు కాపాడే ప్రయత్నం చేసినా సరే లాభం లేకుండా పోయింది. ఇంటికి కొద్ది దూరంలో ఉన్న షాప్ లో ఉన్న తండ్రికి ఫోన్ చేసి చెప్పారు. తండ్రి వచ్చే లోగా తల్లి మృతి చెందింది.
తమ తల్లి కళ్ళ ముందే ప్రాణాలు కోల్పోవడంతో… అమ్మా అమ్మా అంటూ వారు ఏడవడం చూసి అక్కడ ఉన్న వాళ్ళు కన్నీరు పెట్టారు. లాలా పెట్ లో ఈ ఘటన జరిగింది. 12 ఏళ్ళ క్రితం మంజులకు వివాహం కాగా ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమె భర్త లాలా పెట్ ప్రధాన రహదారి పై అయ్యంగార్ బేకరి నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.