తెలంగాణ ఇంటర్‌ హాల్‌టిక్కెట్లు విడుదల.. ఇలా డౌన్లోడ్ చేసుకోండి

-

తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్. ఈ ఏడాది నిర్వహించనున్న వార్షిక పరీక్షలకు సంబంధించిన హాల్‌ టిక్కెట్లు విడుదలయ్యాయి. ఇటీవల ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్ల లాగిన్‌ ద్వారా డౌన్‌లోడ్‌కు అవకాశం ఇచ్చిన ఇంటర్‌ బోర్డు.. తాజాగా విద్యార్థులే తమ హాల్‌టిక్కెట్లను నేరుగా పొందేలా అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.

ఇక ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ఫిబ్రవరి 28వ తేదీ నుంచి మార్చి 19వ తేదీ వరకు జరగనున్న విషయం తెలిసిందే. తెలంగాణ వ్యాప్తంగా ఈ ఏడాది 9.8 లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ పరీక్షలు రాయనున్నారు. ప్రథమ ఇంటర్‌ విద్యార్థులైతే ఎస్‌ఎస్‌సీ హాల్‌టిక్కెట్‌ నంబర్‌, పుట్టిన తేదీని ఎంటర్‌ చేయడం ద్వారా హాల్‌టిక్కెట్లు పొందొచ్చని అధికారులు తెలిపారు. ద్వితీయ ఇంటర్‌ విద్యార్థులైతే రోల్‌ నంబర్‌/గత ఏడాది హాల్‌టిక్కెట్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్‌చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఇక బ్రిడ్జి కోర్సు విద్యార్థులైతే ఎస్‌ఎస్‌సీ పరీక్ష నంబర్‌/రోల్‌ నంబర్‌/పుట్టిన తేదీ వివరాలను ఎంటర్‌ చేయడం ద్వారా హాల్‌టిక్కెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని వెల్లడించారు.

ఫస్ట్ ఇయర్ ఇంటర్ హాల్టికెట్లు కోసం క్లిక్ చేయండి

సెకండ్ ఇయర్ ఇంటర్ హాల్టికెట్లు కోసం క్లిక్ చేయండి

బ్రిడ్జి కోర్సు హాల్టికెట్లు కోసం క్లిక్ చేయండి

Read more RELATED
Recommended to you

Exit mobile version