ఇందిరమ్మ ఇళ్లకు నిధులు ఇచ్చేందుకు హడ్కో గ్రీన్ సిగ్నల్

-

తెలంగాణలో ఇందిరమ్మ గృహ నిర్మాణం పథకానికి నిధుల కొరత తీరనుంది. మొదటి దశలో రూ.3 వేల కోట్లను రాష్ట్ర ప్రభుత్వ పూచీకత్తుపై రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థకు రుణం ఇచ్చేందుకు హడ్కో అంగీకారం తెలిపింది. గత నెలలో ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. లోక్‌సభ ఎన్నికలు ముగిసిన తర్వాత అధికారికంగా ప్రకటించాలని నిర్ణయించింది.

లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం నిధుల కొరత రాకుండా ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా హడ్కో నుంచి రుణం తీసుకోవాలని నిర్ణయించి గృహ నిర్మాణ శాఖ రుణ ప్రతిపాదనలను పంపింది. అధికారులు సుమారు రూ.5 వేల కోట్ల రుణం కోసం అధికారులు ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. ఇళ్ల నిర్మాణానికి దశల వారీగా రుణం ఇవ్వాలని హడ్కో (హౌసింగ్​ అండ్ డెవెలంప్​మెంట్​ కార్ప్​) నిర్ణయించింది.

రోవైపు లబ్ధిదారుల ఎంపిక చేపట్టకపోవడంతో గత ప్రభుత్వం పంపిన రుణ ప్రతిపాదనలు కూడా ఉండడంతో ప్రాథమికంగా రూ.3 వేల కోట్ల రుణం మంజూరు చేసేందుకు హడ్కో అంగీకరించింది. మొదటి దశలో రూ.850 కోట్లు విడుదల చేసేందుకు నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version