హైదరాబాద్‌ చైన్ స్నాచింగ్ కేసులో విచారణ పురోగతి

-

హైదరాబాద్ చైన్ స్నాచింగ్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ దోపిడీకి పాల్పడింది నలుగురు వ్యక్తులను గుర్తించారు. రెండు ముఠాలుగా విడిపోయి సికింద్రాబాద్ పరిధిలోని ఆరు ప్రాంతాల్లో గొలుసు దొంగతనాలు చేశారని తెలిపారు. యూపీకి చెందిన పింకు, అశోక్‌తో పాటు మరో ఇద్దరు నిందితులు ఈ ముఠాలో భాగమని వెల్లడించారు.

Nellore chain snatching case

“యూపీకి చెందిన పింకు, అశోక్‌, మరో ఇద్దరు నిందితులు హైదరాబాద్‌కు వచ్చారు. యూపీ నుంచి విమానంలో వచ్చి నాంపల్లిలో ఓ లాడ్జిలో బస చేశారు. కోఠిలో బైక్ చోరీ చేసి ఆరు చైన్ స్నాచింగ్‌లకు పాల్పడ్డారు. చోరీ తర్వాత పారిపోయేందుకు ఎంజీబీఎస్, జేబీఎస్‌కు వెళ్లారు. చోరీ తర్వాత కాచిగూడ, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు పారిపోయారు.” అని హైదరాబాద్ పోలీసులు తెలిపారు.

పోలీసుల తనిఖీలు ఉండడంతో నిందితులు మరిన్ని చోరీలకు పాల్పడకుండా వెనక్కి తగ్గినట్లు సమాచారం.
మెహిదీపట్నం, గోల్కొండ ప్రాంతాల్లో నిందితులు ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. 2016లో పింకు, అశోక్ రాచకొండ పరిధిలో పలు చోరీలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version