హైదరాబాద్​లో తుపాకీ మోత.. రెస్టారెంట్ జనరల్​ మేనేజర్​పై కాల్పులు.. మృతి

-

హైదరాబాద్‌లో మారోమారు కాల్పులు కలకలం సృష్టించాయి. మియాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని మదీనాగూడ సందర్శిని ఎలైట్ రెస్టారెంట్‌లో పనిచేస్తున్న 35 ఏళ్ల జనరల్ మేనేజర్ దేవేందర్ గాయన్‌పై గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపి పరారయ్యాడు. గాయపడిన దేవేందర్‌ను హోటల్‌ సిబ్బంది హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఆరా తీశారు. పోలీసులు, క్లూ టీమ్‌ అన్నీ వివరాలను సేకరిస్తున్నాయి. సీసీటీవీ ఫుటేజీ ద్వారా నిందితుడిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. దేవేందర్‌ హోటల్‌లో విధులు ముగించుకొని ఇంటికి వెళుతున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి కంట్రీ మేడ్ పిస్తోల్ తో కాల్పులు జరిపి పరారైనట్లు  మాదాపూర్ డీసీపీ గోనె సందీప్ తెలిపారు. నిందితుడిని పట్టుకునేందుకు ఆరు బృందాలుగా గాలింపు చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. హోటల్‌లో పని చేస్తున్న అమ్మాయి ప్రేమ వ్యవహారమే ఘటనకు కారణమై ఉండవచ్చని  పోలీసులు భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version