నా పోరాటం వల్లే ఈరోజు హైదరాబాద్ ఇలా ఉంది – చంద్రబాబు నాయుడు

-

ప్రజా గాయకుడు…తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన గద్దర్ ఇటీవలే మరణించిన విషయం తెలిసిందే. ప్రజా సమస్యలపై పాట రూపంలో గళం విప్పే గద్దర్.. ఇటీవలే పార్టీ ఏర్పాటు చేయాలని ఢిల్లీకీ కూడా వెళ్లాడు. ఇంతలోనే తిరిగిరాని లోకాలకు వెళ్లాడు. అయితే ఇవాళ ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు గద్దర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

గద్దర్ ను భయం అంటే తెలియని వ్యక్తిగా అభివర్ణించాడు చంద్రబాబు. 1997లో గద్దర్ పై కాల్పులు ఘటనపై చంద్రబాబు స్పందించారు. కాల్పుల ఘటనకు సంబంధించి తనపై తప్పు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు చంద్రబాబు.కాల్పుల ఘటన తర్వాత గద్దర్.. నాతో అనేక సార్లు మాట్లాడారు. నా లక్ష్యం.. గద్దర్ లక్ష్యం ఒక్కటే.. పేదల హక్కుల పరిరక్షణమే మా ధ్యేయం అని పేర్కొన్నారు.హైదరాబాద్ అభివృద్దికి కారణం ఎవరో అందరీ తెలుసుఅని.. హైదరాబాద్ అభివృద్ధి ఫలాలు తెలంగాణలో ప్రతి ఒక్కరికీ అందుతున్నాయి తెలిపారు. గద్దర్ ఎన్నో ప్రజా పోరాటాలకు నాంది పలికారు.తెలంగాణ ఉద్యమంలో గద్దర్ పాత్ర కీలకం అని.. ప్రజాయుద్ధ నౌక పేరు వింటే గద్దర్ గుర్తొస్తారు పేర్కొన్నారు చంద్రబాబు నాయుడు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version