హైదరాబాద్ లో మోస్ట్ వాటెండ్‌ గంజాయి డాన్‌ అరెస్టు.. 100 కోట్ల విలువైన..?

-

మోస్టు వాటెండ్‌ గంజాయి డాన్‌ అంగూర్‌ బాయ్‌ ని అరెస్టు చేసారు. దూల్పేట్ నుంచి ఐటీ క్యారిడార్ వరకు గంజాయి అమ్ముతున్నాడు అంగూరు . రిటైల్ గా గంజాయి అమ్మి కోట్ల రూపాయలను సంపాదించిన అంగూర్.. సంపాదించిన డబ్బుతో 100 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను కొనుగోలు చేసాడు. పది కేసుల్లో పోలీసులకు, దొరకుండ తప్పించుక తిరుగుతున్న అంగూర్‌.. కర్వాన్‌లో ఎక్సైజ్‌ పోలీసులకు పట్టుబడ్డాడు. ధూల్‌పేట్‌లో గంజాయి డాన్‌గా పిలువబడుతున్న అంగూర్‌.. కార్వాణ్‌ ప్రాంతంలో ఎస్టిఎఫ్ , ఎక్సైజ్‌ పోలీసులు చిక్కాడు.

గంజాయి అమ్మకాల్లో రూ. కోట్లకు పడుగెత్తిన అంగూర్‌. ఇప్పటికే 13 కేసుల్లో నిందితులుగా జైలుకు వెళ్లి వచ్చాడు. అంగూర్ కుటుంబంలోని 15 మంది పై కూడా గంజాయి వ్యక్రే కేసులు ఉన్నాయి. ఒక్కొక్కరిపై 15 నుంచి 20 కేసులు ఉన్నట్లు తెలిపిన ఎక్సైజ్ అధికారులు.. ధూల్‌పేట్‌ ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్‌లో 3 కేసుల్లోను, మంగల్‌హట్‌ పోలీస్‌ స్టేషన్‌లో 4 కేసుల్లోను ఆసిఫ్ నగర్ , గౌరారం స్టేషన్లలో పది కేసులు ఉన్నట్లు వివరించారు. ఈ కేసుల్లో అరెస్టు చేయడానికి ఎక్సైజ్‌, పోలీసులు ఎన్నిమార్లు నిఘా పెట్టిన అంగూర్‌ తప్పించుకొని తిరుగుతు.. ఇప్పుడు దొరికిపోయాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version