అబిడ్స్ బొగ్గులకుంటలో ఆదివారం రాత్రి అగ్ని ప్రమాదానికి గురైన క్రాకర్స్ దుకాణ ప్రాంతాన్ని పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్.. అగ్ని ప్రమాదంలో పూర్తిగా కాలిపోయిన క్రాకర్స్ దుకాణాన్ని ఆ పక్కనే ఆహుతి అయిన టిఫిన్ సెంటర్‌ను పరిశీలించి ప్రమాదానికి కారణాలను స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. అగ్నికి పూర్తిగా తగలబడిన దుకాణం పరిసరాలను, దుకాణం లోపలి భాగం ఏ మేర దెబ్బతిన్నది అనేది నేరుగా షట్టర్‌లోకి వెళ్లి పరిశీలించిన రంగనాథ్.. టపాసుల దుకాణ దారులు భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
ఇక బహిరంగ ప్రదేశాల్లోనే క్రాకర్స్ దుకాణాలను ఏర్పాటు చేయాలనీ సూచించిన రంగనాథ్… అగ్ని ప్రమాదం జరిగిన దుకాణానికి అనుమతులు లేవని.. ఆ దగ్గర్లోని బహిరంగ ప్రదేశంలో దీపావళి సందర్భంగా తాత్కాలిక క్రాకర్స్ దుకాణం ఏర్పాటు చేయడానికి అనుమతులు పొంది.. ఇక్కడ షట్టర్లో ఎలాంటి అనుమతులు లేకుండా.. అమ్మకాలు చేపట్టారని స్థానిక అధికారులు హైడ్రా కమిషనర్‌కు వివరించారు.