Hydra: వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని గోడను కూల్చివేత!

-

 

 

ఇవాళ మళ్లీ హైడ్రా రంగంలోకి దిగింది. అక్రమ నిర్మాణాలు ఎక్కడ ఉన్నా… తగ్గేదే లేదంటూ హైడ్రా ముందుకు వెళ్తోంది. అక్రమంగా నిర్మించిన అలాగే… కబ్జాలు చేసి నిర్మించిన కూడా… కూల్చివేతలు చేసుకుంటూ ముందుకు వెళ్తోంది హైడ్రా. అయితే ఇలాంటి నేపథ్యంలోనే తాజాగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని కి ఊహించని ఇచ్చింది హైడ్రా.

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో మరోసారి హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి.. పెద్ద చెరువు వద్ద ఏపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కాటసానికి చెందిన గోడ కూల్చివేశారు.. గతంలోనూ ప్రహారీ గోడను కూల్చివేసిన అధికారులు.. తిరిగి ప్రహారీ గోడను నిర్మించడంతో మళ్లీ కూల్చివేతలు షురూ చేశారు. హైడ్రా చీఫ్ రంగనాథన్ ఆధ్వర్యంలోనే ఈ కూల్చివేతలు జరుగుతున్నాయి. పడగొట్టిన గోడను మళ్ళీ కట్టడం కారణంగా హైడ్రా సీరియస్ అయింది. దీంతో నోటీసులు ఇచ్చి మరి కాటసాని గోడను పడగొడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news