మేడ్చల్ జిల్లాలో హైడ్రా అధికారులు అక్రమ నిర్మాణాలపై కొరడా ఝలిపిస్తున్నారు. శనివారం ఉదయమే అక్రమ నిర్మాణాలు, కబ్జాలపై మార్కింగ్ వేసి మరీ వాటిని నెలమట్టం చేస్తున్నారు. కొందరు ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని నివాసాలు, వ్యాపార సముదాయాలు, రోడ్డును బ్లాక్ చేసి సైడ్ వాల్స్ నిర్మించినట్లు ఫిర్యాదులు అందడంతో హైడ్రా రంగంలోకి దిగింది.
ఈ క్రమంలోనే నేటి ఉదయం మేడ్చల్ జిల్లా నారపల్లి,దివ్య నగర్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య హైడ్రా కూల్చివేతలు కొనసాగాయి. నల్ల మల్లారెడ్డి ఇన్‌స్టిట్యూట్ ప్రహరీ కూలుస్తున్న నేపథ్యంలో హైడ్రా అధికారులతో కాలేజ్ యాజమాన్యం గొడవకి దిగారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి అధికారులకు రక్షణ కల్పించారు.కాలేజీ యాజమాన్యాన్ని కంట్రోల్ చేశారు.