జగన్‌కు చెప్పిన ఆ తరువాతే రాజీనామా చేశాను – విజయసాయిరెడ్డి

-

జగన్‌కు చెప్పిన ఆ తరువాతే రాజీనామా చేశాను అని క్లారిటీ ఇచ్చారు విజయసాయిరెడ్డి. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి.. రాజ్యసభ చైర్మన్ ను కలిసి రాజీనామా లేఖ ఇచ్చారు. అనంతరం విజయసాయిరెడ్డి మాట్లాడారు. లండన్ లో వున్న జగన్మోహన్ రెడ్డితో ఫోన్‌లో మాట్లాడానని వివరించారు. అన్ని వివరాలను జగన్‌కు వివరంగా చెప్పానని తెలిపారు.

Vijayasai Reddy before the media on resignation

జగన్‌కు చెప్పిన ఆ తరువాతే రాజీనామా చేశాను అంటూ విజయ సాయిరెడ్డి ప్రకటించారు. నా రాజకీయ జీవితంలో ఏ రోజు అబద్దాలు చెప్పలేదు.. చెప్పను కూడా అని వెల్లడించారు. ఒకవేళ నేను అబద్దాలు చెప్తాను అని మీరు అనుకుంటూ అది మీ విజ్ఞతికే వదిలేస్తున్నా అంటూ ఎమోషనల్‌ అయ్యారు విజయసాయిరెడ్డి.

 

Read more RELATED
Recommended to you

Latest news