దిల్లీ లిక్కర్ కేసులో ఏముందని సీరియల్లా సాగదిస్తున్నారు : ఎమ్మెల్సీ కవిత

-

దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఏముందని టీవీ సీరియల్‌ మాదిరి సాగదీస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఆ కేసులో తాను బాధితురాలినని స్పష్టం చేశారు. రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడితే ఎదుర్కొంటామన్న ఆమె.. రాజకీయాల్లో సిద్ధాంతాలకు చోటు లేకుండా పోయిందని వాపోయారు. ఆదర్శ్ స్కాంలో ఉన్న అశోక్ చవాన్‌కు రాజ్యసభ సీటు ఇచ్చారన్న కవిత.. అశోక్‌ చవాన్‌ను సీఎం అభ్యర్థిగా కూడా ప్రకటిస్తారని పేర్కొన్నారు.

“సీఎం రేవంత్‌కు రాజకీయాలు తప్ప.. ప్రజల గురించి పట్టదు. బీఆర్ఎస్ పార్టీకి ప్రస్తుతం చెడు కాలం నడుస్తోంది.. అయినా ధైర్యంగా ఎదుర్కొంటాం. ఉద్యోగ నియామకాల్లో మహిళలకు అన్యాయం జరిగింది. మహిళలకు 33 శాతం ఉద్యోగాలు రాకుండా జీవో 3 తెచ్చారు. మహిళలకు జరిగిన అన్యాయానికి నిరసనగా రేపు ధర్నాచౌక్‌లో ధర్నా చేస్తాం. ధర్నాకు ఇంకా అనుమతి రాలేదు. జీవో 3ని వెంటనే వెనక్కు తీసుకోవాలి. అభద్రతా భావంతో సీఎం రేవంత్‌ మాట్లాడుతున్నారు.” అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version