రేవంత్ రెడ్డి కి శాపం పెట్టాను.. అందుకే కరోనా వచ్చింది – కేఏ పాల్

-

టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇటీవల కాంగ్రెస్ అనుబంధ సంఘాల సమావేశంలో రేవంత్ రెడ్డి ఇకనుంచి అందరూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఆర్జి పాల్ అనాలని.. సభలు, సమావేశాల్లో కూడా ఆర్జి పాల్ అనే పిలవాలని ఆదేశించారని సమాచారం. అయితే కాంగ్రెస్ నేతల ముందు రేవంత్ రెడ్డి నన్ను అవమానించేందుకు ప్రయత్నించాడని.. అలా అన్నందుకు రేవంత్ రెడ్డికి శాపం పెట్టానని అన్నారు కే ఏ పాల్.

నేను శాపం పెట్టడం వల్లే రేవంత్ రెడ్డికి కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిపారు. ఇండియాను రక్షించమని దేవుడు తనని పంపిన విషయం ఇలాంటి వాళ్లకు అర్థం కాదంటూ కేఏ పాల్ చెప్పుకొచ్చారు. అలాగే ప్రజాశాంతి పార్టీ మునుగోడు బై ఎలక్షన్ లో పోటీ చేస్తుందని.. ఈనెల 19న మునుగోడు లోని అన్ని మండలాల్లో రోడ్ షో చేస్తానని చెప్పారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బిజెపి, కాంగ్రెస్ ఓడిపోతాయని కేఏ పాల్ జోష్యం చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version