కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఐదు హామీలు తనకు నచ్చాయని.. అవి వాస్తవంగా అమలైతే తెలంగాణ రూపు రేఖలు మారిపోతాయని TSPSC మాజీ చైర్మన్ ఘంటా చక్రపాణి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ గాంధీ భవన్ లో విడుదల చేసిన కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పై తాజాగా ట్విట్టర్ వేదికగా ఆయన స్పందించారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన ఐదు న్యాయాల కంటే.. తెలంగాణ కోసం ప్రత్యేకంగా ఇచ్చిన హామీలే ఆకర్షణీయంగా ఉన్నాయని తెలిపారు.
- ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇన్వెస్ట్ మెంట్ రీజియన్ ప్రాజెక్ట్ (ఐటీఐఆర్).
- ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం.. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో ఉక్కు కర్మాగారం, హైదరాబాద్ లో ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్, హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి పక్క నుంచి రాపిడ్ రైల్వే వ్యవస్థ.
- పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా
- హైదరాబాద్ లో సుప్రీంకోర్టు బెంచ్
- నూతన విద్యాసంస్థల, విద్యాలయాల ఏర్పాటు తనకు నచ్చాయని చెప్పుకొచ్చారు ఘంటా చక్రపాణి.