ఆయన చెప్పడంతోనే ఫార్ములా-ఈ ఒప్పందం : అర్వింద్‌కుమార్‌

-

హైదరాబాద్‌లో ఈ-ప్రిక్స్‌(ఫార్ములా-ఈ) కార్యక్రమ నిర్వహణపై నోటీసులు అందుకున్న ఐఏఎస్ అర్వింద్ కుమార్ తాజాగా ఆ వ్యవహారంపై ప్రభుత్వానికి నివేదిక అందించారు. ఈ కార్యక్రమ నిర్వహణ బాధ్యత హెచ్‌ఎండీఏ తీసుకోవాలని అప్పటి పురపాలకశాఖ మంత్రి ఫోన్‌ చేసి ఆదేశాలిచ్చారని ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించిన అర్వింద్‌కుమార్‌ ప్రభుత్వానికి తాజాగా నివేదించారు. ఫార్ములా-ఈ కార్యక్రమానికి జరిగిన ఒప్పందాలు, చెల్లింపులతో కూడిన వివరాలు వెల్లడిస్తూ డిసెంబరు 14న అర్వింద్‌కుమార్‌ సీఎం ముఖ్యకార్యదర్శికి సమాచారం అందించగా.. తాజాగా ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయి.

ఫార్ములా-ఈ సీజన్‌-10 నగరంలో నిర్వహించడంపై ఫార్ములా ఈ-ఆపరేషన్స్‌ సంస్థ(ఎఫ్‌ఈవో) ప్రాథమిక క్యాలెండర్‌లో పొందుపరచనప్పటికీ మంత్రి స్వయంగా ఆ సంస్థ చీఫ్‌ ఛాంపియన్‌షిప్‌ అధికారి ఆల్బర్టో లాంగోతో మాట్లాడి ఒప్పించారని తెలిపారు. ఈ ఈవెంట్‌ నిర్వహణకు ప్రమోటర్లు, స్పాన్సర్ల ఖరారు కాక ముందే హెచ్‌ఎండీఏ ఆతిథ్యమివ్వాలని ఆదేశించినట్లు ఆయన నివేదికలో పేర్కొన్నారు. ఈ మేరకు ఎఫ్‌ఈవో సంస్థతో ఒప్పంద పత్రాలపై ప్రమోటర్‌, ఆతిథ్య నగర హోదాలో సంతకాలు చేశామని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version