HMDA మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో కస్టడి కన్ఫేషన్ స్టేట్మెంట్ కీలకంగా మారింది. HMDA మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ కస్టడి కన్ఫేషన్ లో ఒక ఐఏఎస్ అధికారి పేరు ప్రస్తావన వచ్చిందని సమాచారం. పలువురి ఒత్తిడి మేరకే అక్రమాలు, ఆస్థులు అంటూ శివబాకృష్ణ స్టేట్మెంట్ ఇచ్చారు.ఇప్పటికే శివ బాలకృష్ణ వద్ద డాక్యుమెంట్ లెక్కల ప్రకారం 1000 కోట్ల విలువైన ఆస్తులు గుర్తించింది ఏసీబీ.
214 ఎకరాలు భూములు గుర్తించిన ఏసీబి..బాలకృష్ణ ను 8 రోజుల పాటు కస్టడీ లోకి తీసుకుని విచారించింది. శివ బాలకృష్ణ తోళపాటు ఇతర అధికారుల పాత్ర పై ఆరా తీస్తున్న ఏసీబీ… శివ బాలకృష్ణ బినామీలపై కొనసాగుతోంది. శివబాలకృష్ణ కేసులో ఈడీ, ఐటీ ఫోకస్ చేసింది. కేసు వివరాల సేకరణలో కేంద్ర దర్యాప్తు సంస్థలు ఉన్నాయి.సోదరుడు నవీన్ అరెస్ట్ మరో ఇద్దరి అరెస్ట్ కు రంగం సిద్దం అయ్యారు అధికారులు. ఇక HMDA మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ బెయిల్ పిటిషన్ పై నేడు విచారణ జరుగనుంది.