కేటీఆర్ కి దమ్ముంటే తప్పులు ఏంటో నిరూపించాలి : షబ్బీర్ అలీ

-

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీని విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే అధికార, ప్రతిపక్షాల మధ్య ఇప్పుడు నిత్యం వార్ చోటు చేసుకుంది. ఇటీవలే కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో ఆర్థిక, విద్యుత్ కి సంబంధించిన శ్వేత పత్రం విడుదల చేసింది. దానికి కౌంటర్ గా బీఆర్ఎస్ మొన్న శ్వేద పత్రం విడుదల చేసింది. కాంగ్రెస్ శ్వేత పత్రంలో తప్పులున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.

అయితే తాజాగా కేటీఆర్ పై మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఫైర్ అయ్యారు. ఇటీవలే అసెంబ్లీలో గత పదేళ్ల తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేత పత్రంలోని వివరాలు తప్పు అని కేటీఆర్ ఎలా చెబుతాడని ప్రశ్నించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో పదేళ్లు పని చేసిన అధికారులే ఆ వివరాలను ఇచ్చారని తెలిపారు. ఆ లెక్కలను తప్పు అని కేటీఆర్ ఎలా చెబుతాడని మండిపడ్డారు. కేటీఆర్ కి దమ్ముంటే.. ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంలో తప్పు ఏంటి అని నిరూపించాలని సవాల్ విసిరారు.

ప్రభుత్వ శ్వేత పత్రానికి కౌంటర్ గా శ్వేద పత్రం పేరుతో కేటీఆర్ పిల్ల బచ్చా చేష్టలు చేశాడని ఎద్దేవా చేశారు. ఆరు గ్యారెంటీలకు దరఖాస్తులు ప్రభుత్వమే ఇస్తుందని తెలిపారు. ఆరు గ్యారెంటీల ఫామ్ ను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేస్తారని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version