అవసరం అయితే అశోక్ నగర్ వెళ్తా.. లాఠీ ఛార్జ్ పై స్పందించిన బండి సంజయ్

-

తెలంగాణ లో ఇప్పుడు గ్రూపు 1 మెయిన్స్ పరీక్షలపై వివాదం సంచలనంగా మారింది. గ్రూపు 1 మెయిన్స్ పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే నిరసన వ్యక్తం చేస్తున్న కొంత మందిపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. దీంతో ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తాజాగా కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. అశోక్ నగర్ లో గ్రూపు 1 అభ్యర్థులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడం చూస్తే బాధ వేస్తుందని తెలిపారు.

పోలీసుల కొట్టుడు చూస్తే.. ఒక్క యువకుడిని 10 మంది పోలీసులు కలిసి కొట్టారు. ఓ అమ్మాయి భయపడుతూ పరుగెత్తుతోంది పాపం. షాపుల్లోంచి లాక్కొచ్చి మరీ కొడుతున్నారు. అవసరం అయితే తప్పకుండా నేను కూడా అశోక్ నగర్ వెళ్తా. ఈ మంత్రి పదవీ అంతా తరువాత.. బీజేపీ కార్యకర్తగా వారిని కలుస్తానని తెలిపారు బండి సంజయ్. గ్రూపు 1 పరీక్షలను రీ షెడ్యూల్ చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. పరీక్షలను వాయిదా వేయాలని కోరితే.. రక్తం కళ్ల చూస్తారా..? అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కేంద్ర మంత్రి బండి సంజయ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version