తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్… !

-

IMD Issues Yellow Alert For Telangana : తెలంగాణ రాష్ట్ర జిల్లాలకు బిగ్ అలర్ట్. ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది. నిన్నటి నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు మళ్లీ ప్రారంభమయ్యాయి. ఇక ఇవాళ.. కూడా భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో.. ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది.

IMD Issues Yellow Alert For Telangana

అలాగే అదిలాబాద్ మంచిర్యాల ఆసిఫాబాద్, కరీంనగర్ సిరిసిల్ల పెద్దపల్లి భూపాలపల్లి రంగారెడ్డి వికారాబాద్ సంగారెడ్డి మహబూబ్నగర్ నారాయణపేట నిజామాబాద్ జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని… ఈ ఉత్తర తెలంగాణ జిల్లాలలో ఎల్లో అలర్ట్ జారీ కూడా చేసింది ఈ వాతావరణ శాఖ. మిగిలిన జిల్లాలలో… ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని స్పష్టం చేసింది. కాబట్టి జనాలు బయటికి వెళ్లేటప్పుడు కాస్త ఆలోచించి వెళ్ళండి అని కోరింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version